AKP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల హాజరవుతారన్నారు. 25 బహుళ జాతి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని.. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.