AKP: తన కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దేవరాపల్లి(M) కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే హత్య చేస్తారా అంటూ బోరున విలపించారు. తమకు జరిగిన కడుపుకోత ఏ కుటుంబానికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన రూప, చిన్ని తన కొడుకుని చెన్నై తీసుకెళ్లి చంపేశారని ఆరోపించింది.