MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ పరిధిలోని కడెం కాలువ ప్రధాన రోడ్డుపై జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. మండలంలోని లింగాపూర్ ఫారెస్ట్ బీట్లో గిరిజనులు భూములను ఆక్రమించుకోవడంతో ఆటవీ అధికారులు గిరిజనులను అడ్డుకునే ప్రయత్నాన్ని కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను అధికారులు అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.