KDP: వేయినూతుల కోన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత, చందన, తదితర అభిషేక కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం స్వామి వారిని తులసి దళాలు , పూలమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.