యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మిరాయ్’. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. US మార్కెట్లో ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ప్రీమియర్స్ సహా డే 1 నాటికి ఈ మూవీ 7లక్షల డాలర్లను అందుకుంది. ఈ వీకెండ్కి ఈజీగా 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.