SDPT: రూరల్ చింతమడకలో రైతులు యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచి లైన్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. శనివారం ఉదయం యూరియా ఇస్తామని అధికారుల ప్రకటనతో రైతులు రాత్రి నుంచే సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రైతులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.