SRD: భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను కలిశారు. డివిజన్ అభివృద్ధి కోసం సుమారు రూ.2 కోట్ల ప్రతిపాదనలు శనివారం సమర్పించారు. ఇందులో ఎల్.ఐ.జీ కాలనీ బస్ స్టాప్–మ్యాక్ సొసైటీ అంబేద్కర్ విగ్రహం వరకు రహదారి అభివృద్ధి, ఏం.ఐ.జీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉన్నాయి.