NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 589.50 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి 590 అడుగులకు కేవలం 0.5 అడుగులే మిగిలి ఉంది. ప్రస్తుతం 310.551 టీఎంసీలు నీటి నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లో 1,64,867 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 71,172 క్యూసెక్కులు ఉంది. 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి, 1,12,672 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.