NZB: మాక్లూర్ మండలం అమ్రాద్ తండ గ్రామ కమిటీ సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అంకాపూర్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈనెల 19, 20వ తేదీల్లో అమ్రాద్ తండాలో నిర్వహించే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మహేష్, వీడీసీ అధ్యక్షుడు మురళీ, జగన్ పాల్గొన్నారు.