AP: నెల్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థినిని ఆమె స్నేహితుడే హత్య చేశాడు. మాట్లాడాలని రూమ్‌కి పిలిచి.. కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.