E.G: చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ భవిష్యత్‌కు అడ్డంకి అవుతారనే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని శాప్ మాజీ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డితో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిశారు.