VSP: ఉత్తర నియోజకవర్గం పరిధిలో వైసీపీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని నగర డిప్యూటీ మేయర్ కె. సతీష్ సూచించారు. 42, 43, 45 వార్డులకు చెందిన ముఖ్య నాయకులతో ఇవాళ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలు దోహదపడతాయన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలన్నారు.