SRCL: కోనరావుపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు శనివారం, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాసాని శంకర్ గౌడ్, మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్, తదితరులు చేరారు.