మేడ్చల్: స్వాన్ లైన్ అపార్ట్మెంట్స్ గృహిణి రేణుక అగర్వాల్(50) హత్య కేసును ఛేదించారు. నిందితులైన హర్ష్ కుమార్ (20), రోషన్ సింగ్ (22) ఇద్దరు గృహ సహాయకులు, వీరికి సహాయం చేసిన రాజు వర్మ(19)లను జార్ఖండ్‌లోని రాంచి వద్ద అరెస్ట్ చేశారు. మహిళను కట్టేసి, గొంతు కోసి హత్య చేసి, బంగారం, నగదు, గడియారాలు దోచుకెళ్లారు. వారి వద్ద బంగారు ఆభరణాలు, 16 గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.