TG: HYDలోని బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టయింది. స్థానిక పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మత్తుమందు తరలిస్తుండగా.. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల నుంచే వీరంతా దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.