VSP: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇవాళ నిరసన జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. విభజన చట్టంలోని హామీల అమలు, రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.