భారత బాక్సర్స్ నుపుర్ షెరాన్, జేస్మిన్ లంబోరియా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లారు. నిన్న జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో సైమా డుజ్టస్(TUR)ను 5-0తో నుపుర్.. ఒమైలిన్ అల్కాలా(VEN)ను 5-0 తేడాతో జేస్మిన్ చిత్తు చేసి ఫైనల్కు అర్హత సాధించారు. దీంతో పసిడి కోసం అగత(POL)తో నుపుర్.. జులియా(POL)తో జేస్మిన్ తలపడనున్నారు.