AKP: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ నెల 15న రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. పరవాడలో ఇవాళ ఈ కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేశారు. గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.