JDWL: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని ఎం.ఈ.ఎల్.డీ. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. కలాందర్ భాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ https://www.braouonline.in/ లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.