KRNL: ఎమ్మిగనూరులో వాల్మీకీ, ఎస్సీలను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన స్వగృహంలో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించిన వాల్మీకి భవనాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాగే అంబేద్కర్ భవనానికి స్థలం ఇచ్చినా ఐదేళ్లలో పూర్తి చేయలేదని విమర్శించారు.