VZM: కొత్తవలస పట్టణ కేంద్రం అనుకొని ఉన్న సర్వే నంబర్ 142/1 ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మిస్తున్నారని హిట్ టీ.వి లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తకు స్పందించి శనివారం రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖ్, వీఆర్వో సుధీర్ అక్రమణ దారుడిని హెచ్చరించారు. నవరాత్రుల ఆనంతరం షెడ్‌ను స్వయంగా తొలగిస్తానని రెవెన్యూ అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు.