TG: కొమురంభీం జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషయం గమనించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.