KMR: తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన అఖిల అనే మహిళకు శుక్రవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల జన్మించినా, శిశువులో చలనం లేకపోవడంతో మృత శిశువు అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ కడుపులోనే మృతి చెందిందని ఆరోపించారు.