KRNL: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేవనకొండ మండలం పి. కోటకొండలో ఇవాళ చాకలి నాగమ్మ, గిడ్డయ్య ఇల్లు కుప్పకూలింది. ఘటనా సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. ఉన్న ఒక్క ఇల్లూ కూలిపోవడంతో ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలన్నారు.