HYD: సికింద్రాబాద్లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి మత్తుమందు తయారీ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. పాత స్కూల్లో రియాక్టర్లు ఏర్పాటు చేసి అక్రమంగా మత్తుమందు తయారు చేస్తున్న ముఠాను గుర్తించారు. తయారైన మత్తుమందును తరలిస్తున్న సమయంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన మత్తుమందు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.