W.G: తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామ చెరువులో 4 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతుడు బంధువులు ఇప్పటివరకు రాకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాళ్ల శ్రీనివాసు తన సొంత ఖర్చులతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసును పలువురు అభినందిస్తున్నారు.