W.G: పెనుగొండ సర్పంచ్ నక్కా శ్యామల సోనీకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే సర్పంచ్ సంవాద్ కాన్ క్లేవ్కు ఆహ్వానం లభించింది. దేశ వ్యాప్తంగా 75 మంది సర్పంచ్లకు ఆహ్వానం అందగా దానిలో పెనుగొండ సర్పంచ్ శ్యామల సోని ఉన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆచంట నియోజకవర్గంలోని కూటమి నాయకులు అభినందనలు తెలిపారు.