TG: మాజీమంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ అంటున్నారని.. అయితే రాహుల్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత కేటీఆర్‌కు లేవని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ మోదీకి మడుగులు ఒత్తుతున్నారని ఆయన ఆరోపించారు.