SRD: ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో నిర్మించుకోవాలని ఖేడ్ మండలం వెంకటాపురం మాజీ సర్పంచ్ గంగయ్య లబ్ధిదారులకు సూచించారు. గ్రామానికి చెందిన కర్ర రాములు చౌహన్ ఒక్కో లబ్ధిదారుకు 15 సిమెంట్ సంచులు చొప్పున ముగ్గురికి స్వచ్ఛందంగా ఇవ్వగా శనివారం ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో పాటు దాత కూడా లబ్ధిదారులకు సహకరించడం అభినందనీయమని మాజీ సర్పంచ్ తెలిపారు.