SRD: పిటీ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖేడ్ కోర్టు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. శనివారం ఖేడ్ కోర్టులో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 482 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ పరిధి పోలీసులు, న్యాయవాదులు ఉన్నారు.