కోనసీమ: కొత్తపేట సందీప్ ఐ క్లినిక్‌లో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత న్యూరో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు సందీప్ కంటి ఆసుపత్రి డాక్టర్ బండారు పెదవెర్రియ్య తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ న్యూరో కేర్ ఎస్.జె.బాల పరమేశ్వరరావుచే న్యూరో వైద్య శిబిరం ద్వారా ఉచిత పరీక్షలు మందులు అందజేస్తామన్నారు. అవసరమైన వారు సేవలు వినియోగించుకోవాలని కోరారు.