MNCL: మంచిర్యాల జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించే బాధ్యత రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కాసిపేటలో 3, హాజీపూర్‌లో 2 భవనాలకు దాతలు రెండు గుంటల చొప్పున స్థలాలు ఇచ్చారని వెల్లడించారు.