ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హిమబిందు ఆదివారం విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఇటీవల పాఠశాల అల్పాహారంలో పురుగులు రావడం, అపరిశుభ్రత పాటించడంతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప్రకటన విడుదల చేశారు. విధులపై నిర్లక్ష్యం, మెనూ ప్రకారం భోజనం వడ్డించకపోతే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.