TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సర్వే నంబర్ 217లోని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. 2011లో 12 ఎకరాల భూములను ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు కేటాయించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు కేటాయించిన భూముల్లో హనీశ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కబ్జాలో ఉంది.