KRNL: ఆదోని మండలం కపటి గ్రామ నడివొడ్డున ఉన్న మూడు ముఖాలమ్మ ఆలయంలో దేవతామూర్తికి ఉన్న 50 తులాలు కలిగిన వెండి ముఖ కవచాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్థులు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ నల్లప్ప సిబ్బందితో చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. పూజారి ఎల్లమ్మను విచారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.