ADB: నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. గ్రామానికి చెందిన ఆడే అశోక్ ఇటీవల క్యాన్సర్ చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన్ను పరామర్శించారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.