GNTR: జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి 3 నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని, గతంలో జరిగిన లోక్ అదాలత్ ద్వారా గుంటూరు జిల్లా కోర్టు 1,076 సివిల్ కేసులను పరిష్కరించామన్నారు.