BDK: దమ్మపేట మండలంలో గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సహాయం ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.