నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీ ప్రమాణం చేశారు. ఆమెను ఎంచుకునేందుకు జెన్-జెడ్ వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందుకోసం డిస్కార్డ్ యాప్ను నేపాల్ యువత వినియోగించుకుంది. దాదాపు లక్ష మంది ఈ చాట్యాప్లో చేరి తదుపరి ప్రధానిని ఎంచుకున్నట్లు సమాచారం.