హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ఊహించని విజయం అందుకుంది. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్గా 200 థియేటర్లలో 50 రోజుల రన్ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ వదిలారు. ఇక ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.