HYD: కాచిగూడ-యశ్వంత్పూర్- కాచిగూడ (20703-20704) మధ్య నడిచే రెండు వందేభారత్ రైళ్లకు ఇప్పటి వరకు బుధవారం మినహాయింపు ఉండగా, డిసెంబర్ 12 నుంచి శుక్రవారానికి మారుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ (20707-20708) మధ్య ప్రయాణించే మరో రెండు వందేభారత్ రైళ్లకు ప్రతి గురువారం మినహాయింపు ఉండగా.. డిసెంబర్ 5 నుంచి సోమవారానికి మార్చారు.