ASR: కొయ్యూరు మండలంలో ఈనెల 15నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు పశువులకు ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసేందుకు ప్రణాళికలను రూపొందించామని కొయ్యూరు మండల పశువైద్యాధికారి డాక్టర్ కే. రాజేష్ కుమార్ శనివారం తెలిపారు. మండలంలోని 25,500 పశువులు,1,780 గేదెలకు గాలికుంటు, డెక్కజడుపు వ్యాధి నిరోధక టీకాలను వేస్తామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.