కృష్ణా: జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫామ్‌తో రావాలని తెలిపారు.