NLR: అనధికార లే అవుట్లను LRS ద్వారా 30 శాతం అపరాధ రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాలని సంబంధిత యజమానులకు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూచించారు. లేని పక్షంలో జరిమానాలు విధించడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరులో శుక్రవారం జరిగిన ఎల్ఆర్ఎస్ సదస్సులో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో MLA ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు