NZB: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 16న ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులచే వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.