JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CPM నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. సీతారాం నిబద్ధతగల కమ్యూనిస్టుగా ప్రజల కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో CPM నాయకులు ఉన్నారు.