NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన పురస్కరించుకుని శుక్రవారం అచ్చంపేట పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ చిక్కుడు అనురాధ మాట్లాడుతూ.. రక్తదానం మహాదానం అని రక్తదానం చేయడం మూలంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అని వెల్లడించారు. యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు.