TPT: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ శాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థిని సోనికా బోడ్కేకు వర్సిటీ అధికారులు డాక్టరేట్ అందజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జీ.ఇందిరా ప్రియదర్శిని పర్యవేక్షణలో ఆమె “లీగల్ పర్స్పెక్టివ్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇన్ ఇండియా” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఇందుకుగాను ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు అధికారులు తెలిపారు.