ATP: జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తోపుదుర్తి కవిత భర్త, వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతిపై వైసీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి బంధువు. రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.