VZM: తెర్లాం PSలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కంకణాల కిరణ్కు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ తెలిపారు. తెర్లాంకు చెందిన మైనరు బాలిక నడుచుకుంటూ వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కిరణ్ బాలికను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయగా పారిపోయాడు.